కశ్మీర్లో బీజేపీ-పీడీపీ సంకీర్ణానికి తెర.. గవర్నర్ పాలనకు బీజేపీ డిమాండ్!
- ప్రకటించిన రామ్ మాధవ్
- పీడీపీతో మిత్రత్వం కొనసాగించే పరిస్థితులు ఇకలేవు
- ఉగ్రవాదం, హింస, తిరుగుబాట్లు అధికమయ్యాయి
- అక్కడి పౌరుల హక్కులు కూడా ప్రమాదంలో పడ్డాయి
తాము జమ్ముకశ్మీర్‌లో శాంతి స్థాపనకు కృషి చేశామని, అభివృద్ధి కోసం ప్రయత్నం చేశామని రామ్ మాధవ్ అన్నారు. అయితే, జమ్ము, లడఖ్‌లో అభివృద్ధి పనులు జరిపే క్రమంలో తమ నాయకులు ఇబ్బందులు ఎదుర్కున్నారని చెప్పారు. కాగా, అమర్నాథ్ యాత్రకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సెర్చ్ ఆపరేషన్ నిలిపేశామని చెప్పారు.