Mahesh Babu: విశాల్ సినిమాపై మహేష్ బాబు ప్రశంసలు

  • తెలుగు రాష్ట్రాల్లో హిట్ టాక్ సంపాదించుకున్న 'అభిమన్యుడు'
  • సినిమా ఎంతో ఆకట్టుకుందన్న మహేష్ బాబు
  • ఎంతో పరిశోధన చేసి తీశారంటూ అభినందనలు
తెలుగువాడైన తమిళ హీరో విశాల్ నటించిన 'అభిమన్యుడు' సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదలై, హిట్ టాక్ ను సంపాదించుకుంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. తాజాగా, ఈ జాబితాలో ప్రిన్స్ మహేష్ బాబు కూడా చేరాడు. 'అభిమన్యుడు సినిమా నన్ను ఎంతో ఆకట్టుకుంది. హీరో విశాల్ కు, చిత్ర బృందానికి అభినందనలు. డైరెక్టర్ మిత్రన్ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. చాలా పరిశోధన చేసి సినిమాను తీశారు' అంటూ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపాడు. 
Mahesh Babu
vishal
abhimanyudu
movie
tweet

More Telugu News