Arhan Singh: 'చెత్త'బ్బాయ్ అర్హాన్ కూడా సెలబ్రిటీయే... షారూక్ తో ఓ సినిమాలోనూ నటించాడట!

  • బాల నటుడిగా రాణించిన అర్హాన్
  • ప్రస్తుతం ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ నడుపుతున్నాడు 
  • బాలీవుడ్ పెద్దలతో పరిచయాలు కూడా
రోడ్డుపై చెత్త వేసి అనుష్కతో క్లాస్ పీకించుకున్న అర్హాన్ సింగ్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. అర్హాన్ సింగ్ కూడా సెలబ్రిటీ హోదాను అనుభవిస్తున్న వ్యక్తే. చిన్నప్పుడు బాల నటుడిగా పలు చిత్రాల్లోనూ నటించాడు. షారూక్ తో కలసి ఒక సినిమా కూడా చేశాడు. ప్రస్తుతం ఈవెంట్ మేనేజర్ గా, బాలీవుడ్ సినిమాలకు కో-ఆర్డినేటర్ గా పనిచేస్తున్నాడు.

హిందీ చిత్ర పరిశ్రమలోని చాలా మంది పెద్దలతో అర్హాన్ కు మంచి పరిచయాలే ఉన్నాయి. పలు చిత్రాల ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేసి, వాటిని నిర్వహించే వ్యాపారం ఉంది. ఇక అనుష్క వీడియో వైరల్ అయిన తరువాత, పలువురు అర్హాన్ కు ఫోన్ చేస్తూ, అసలేమైందన్న విషయమై ఆరా తీస్తున్నారట.
Arhan Singh
Virat Kohli
Viral Videos
Anushka Sharma
Sharook

More Telugu News