Chandrababu: చంద్రబాబును ఓడించేందుకు కాపులంతా రెడీగా ఉన్నారు: ముద్రగడ

  • కాపులను మోసం చేసిన చంద్రబాబును ఓడిస్తాం
  • ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనేది ఇంకా నిర్ణయించలేదు
  • అవసరమైతే పవన్ కల్యాణ్ తో కూడా చర్చిస్తాం
ముఖ్యమంత్రి చంద్రబాబును కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి టార్గెట్ చేశారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును ఓడించేందుకు కాపులంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ, వంగవీటి మోహనరంగాను హత్య చేసిన తర్వాత టీడీపీని కాపులు ఓడించారని చెప్పారు.

కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పిన చంద్రబాబు... ఆ తర్వాత మోసం చేశారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే విషయాన్ని ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. 13 జిల్లాల కాపు ప్రతినిధులతో చర్చించిన తర్వాత... తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపారు. అవసరాన్ని బట్టి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కూడా చర్చలు జరుపుతామని చెప్పారు. కాపులను మోసం చేసిన చంద్రబాబుకు వ్యతిరేకంగా పని చేస్తామని తెలిపారు.
Chandrababu
Pawan Kalyan
mudragada padmanabham
vangaveeti ranga

More Telugu News