Chandrababu: నిలదీస్తానని వెళ్లి.. మోదీకి దండాలు పెట్టారు: చంద్రబాబుపై అంబటి సెటైర్లు

షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు మరోసారి విమర్శలు గుప్పించారు. నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని చంద్రబాబు చెప్పుకున్నారని... తీరా సమావేశానికి వెళ్లిన తర్వాత ప్రధాని మోదీకి దండాలు పెట్టారని ఎద్దేవా చేశారు. చంద్రబాబులో ఓవైపు భయం, మరోవైపు వినయం కనిపించాయని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని విమర్శించారు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. నాటకాలు ఆడటంలో చంద్రబాబును మించిన వారు మరెవరూ లేరని దుయ్యబట్టారు.
Go Back to Shorts
Chandrababu
modi
ambati rambabu

More Telugu News