Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తన భర్త వద్దకు వెళ్లాలని ఓ నిర్మాత భార్య నన్ను డిమాండ్ చేసింది: టాలీవుడ్ పాటల రచయిత్రి శ్రేష్ఠ షాకింగ్ కామెంట్స్

  • క్యాస్టింగ్ కౌచ్ బారిన నేను కూడా పడ్డాను
  • చేదు అనుభవాలు ఎదురయ్యాయి
  • 'ఇండియా గ్లిట్జ్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రేష్ఠ
అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు తదితర చిత్రాల్లో పాటలు రాసిన టాలీవుడ్ రచయిత్రి శ్రేష్ఠ తాజాగా 'ఇండియా గ్లిట్జ్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డానని చెప్పారు. తనకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయని, ఆ కారణంగానే తాను చిత్ర రంగంలోకి రావడాన్ని చాలాసార్లు వాయిదా వేసుకున్నానని అన్నారు.

 పురుషులతో పాటు మహిళలు కూడా క్యాస్టింగ్ కౌచ్ కి పాల్పడుతున్నారని చెప్పుకొచ్చిన శ్రేష్ఠ, ఓ నిర్మాత భార్య తనను ఆమె భర్త వద్దకు వెళ్లాలని డిమాండ్ చేసిందని చెప్పారు. ఒక వ్యక్తి తనపై మనసు పారేసుకున్నాడని, గోవాలో ఓ పార్టీ ఇస్తున్నాడని, అక్కడికి వెళ్లాలని ఓ మహిళా దర్శకురాలు చెప్పిందని అన్నారు. ఆ పార్టీకి తాను వెళ్లలేదని, దీంతో సదరు వ్యక్తి తనకు ఫోన్ చేసి చెడామడా తిట్టాడని వాపోయింది. నిస్సహాయురాలినైన తాను, వారిని హెచ్చరించి, కొన్ని నెలల పాటు ఇండస్ట్రీకి దూరమయ్యానని అన్నారు.
Tollywood
Casting Couch
shrestha
Writter

More Telugu News