New Delhi: గవర్నర్‌ కార్యాలయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు: చంద్రబాబు ఆగ్రహం

  • బీజేపీ కొత్త సంస్కృతికి తెరలేపింది
  • రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తోంది
  • ఢిల్లీలోని కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుంది
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తమ మంత్రులతో కలిసి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ... ఢిల్లీలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి తమ సంఘీభావాన్ని తెలియజేస్తున్నామని ట్వీట్‌ చేశారు.

మరో ట్వీటు చేస్తూ.. గవర్నర్‌ కార్యాలయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని, బీజేపీ కొత్త సంస్కృతికి తెరలేపిందని చంద్రబాబు విమర్శించారు. రాజకీయ అవసరాలకు గవర్నర్‌ కార్యాలయాన్ని వాడుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. 
New Delhi
Chandrababu
Arvind Kejriwal

More Telugu News