Narendra Modi: ఈనెల 17న మోదీని కలుస్తాం.. 24 నుంచి ఆమరణ దీక్ష: సీఎం రమేష్‌

  • మోదీకి వినతిపత్రం ఇస్తాం
  • పోరాటాన్ని ఉద్ధృతం చేస్తాం
  • పాత నివేదికతో కేంద్రం అఫిడవిట్‌ ఇచ్చింది 
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయకుండా నాన్చుడు ధోరణి అవలంబిస్తోన్న కేంద్ర సర్కారు తీరుకి నిరసనగా తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, ఆయన ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ... తన ఆమరణ దీక్ష ఈనెల 24 నుంచి ఉంటుందని, ఈ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని వెల్లడించారు.

అలాగే, తాము ఈనెల 17న ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి ఈ విషయంపై వినతిపత్రం ఇస్తామని, ఒకవేళ మోదీ స్పందించకపోతే తన ఆమరణ దీక్ష 24 నుంచి ఉంటుందని రమేష్‌ అన్నారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్ర సర్కారు పాత నివేదికతో సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ ఇచ్చిందని అభ్యంతరం తెలిపారు.   
Narendra Modi
CM Ramesh
BJP

More Telugu News