ప్రేమించడం లేదని... కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట దారుణం!
- ఉన్మాదిలా మారిన యువకుడు
- యువతి గొంతు కోసి, ఆపై ఆత్మహత్యాయత్నం
- ప్రాణాలు కోల్పోయిన యువతి
ఈ క్రమంలో ఉదయం మీసేవ కేంద్రానికి రసజ్ఞ రాగా, బయట ఆమెతో వాదనకు దిగి, ముందుగానే తెచ్చి పెట్టుకున్న పదునైన ఆయుధంతో ఆమె మెడ నరికాడు. ఆపై ఆత్మహత్యాయత్నం చేశాడు. చుట్టూ ఉన్న స్థానికులు రసజ్ఞను ఆసుపత్రికి తరలిస్తుంటేనే ప్రాణాలు కోల్పోయింది. చేతికి గాయంతో రక్తపు మడుగులో పడివున్న వంశీధర్ ను పోలీసులకు అప్పగించగా, వారు నిందితుడిని ఆసుపత్రికి తరలించారు.