ప్రొడక్షన్ బాయ్ నుంచి సహ నిర్మాత వరకూ ఎదిగిన కిషన్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రొడక్షన్ బాయ్ నుంచి సహ నిర్మాత వరకూ ఎదిగిన కిషన్!

  • సినిమాలపై మోజున్న ఎన్నారైలతో పరిచయాలు
  • విదేశాల్లో సినిమాలు తీస్తున్నట్టు మభ్యపెట్టే కిషన్
  • వారి వద్ద తీసుకున్న డబ్బుతో హీరోయిన్లను అమెరికాకు తీసుకెళ్లి వ్యభిచారం!
  • బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన చికాగో కోర్టు
టాలీవుడ్ హీరోయిన్లను అమెరికాకు పిలిపించి, వారితో వ్యభిచారం చేయిస్తున్నాడన్న ఆరోపణలపై అమెరికాలో అరెస్టయిన మోదుగుమూడి కిషన్ అలియాస్ రాజు వెనుక ఆసక్తికర కథే ఉంది. సినిమాలపై తనకున్న మోజుతో ప్రొడక్షన్ బాయ్ గా పరిశ్రమలో కాలుపెట్టి, పలువురి వద్ద పనిచేస్తూ, అంచెలంచెలుగా సహ నిర్మాత స్థాయికి ఎదిగిన కిషన్, సినిమాలపై మోజున్న ఎన్నారైలతో పరిచయం పెంచుకుని, వారి సాయంతో అమెరికాలో కాలు పెట్టాడని తెలుస్తోంది.

ఎన్నారైలకు దగ్గరైన తరువాత, తాను విదేశాల్లో సినిమాలు తీస్తున్నానని, హీరోయిన్లను తీసుకు వస్తానని వారికి చెప్పి డబ్బు తీసుకునేవాడని సమాచారం. ఆపై హీరోయిన్ల కాల్ షీట్లు తీసుకుని వారిని విజిటింగ్ వీసాలపై అమెరికాకు రప్పించేవాడని, ఆ తరువాత తన దందాను సాగించాడని చికాగో పోలీసులు తమ చార్జ్ షీట్ లో వెల్లడించారు. కాగా, కేసు ఇంకా విచారణ దశలోనే ఉన్నందున కిషన్, చంద్ర దంపతులకు బెయిల్ ను ఇచ్చేందుకు చికాగో కోర్టు అంగీకరించలేదు.
Chicago
Modugumudi Kishan
Tollywood
S*x Rocket
Prostitution

More Telugu News