Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తండ్రిని చెట్టుకు కట్టేసి.. తల్లీకూతుళ్లపై గ్యాంగ్ రేప్!

  • బీహార్ లో మరో దారుణం
  • భర్త కళ్ల ఎదుటే భార్య, కూతురిపై అత్యాచారం
  • 20 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
నేరాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బీహార్ లో మరో దారుణం చోటుచేసుకుంది. తండ్రిని చెట్టుకు కట్టేసి, పిస్టల్ ను ఎక్కుపెట్టి, తల్లీకూతుళ్లపై గ్యాంగ్ రేప్ చేశారు. నిన్న జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి ఇరవై మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బీహార్ లోని సొంధియా ప్రాంతంలో రాత్రి 8 గంటల సమయంలో తండ్రి, తల్లి, కుమార్తె ముగ్గురూ బైక్ పె వెళ్తున్నారు. తండ్రి గయలోని గురారు బజార్ లో వైద్యుడిగా పని చేస్తున్నాడు. క్లినిక్ ను మూసేసి భార్య, కుమార్తె (12)తో కలసి ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యంలోని నిర్మానుష్య ప్రాంతంలో... మారణాయుధాలు కలిగిన 20 మంది వారిని చుట్టుముట్టారు. తన భార్య, కుమార్తెను వారు చెరబట్టే ప్రయత్నం చేస్తుండగా... వారిని ఎదుర్కొనేందుకు ఆయన యత్నించాడు. దీంతో, అతన్ని చెట్టుకు కట్టేసి, గన్ తో బెదిరించి... తల్లీకూతుళ్లపై కామాంధులు అత్యాచారం జరిపారు.

తాము అదుపులోకి తీసుకున్న 20 మందిలో ఇద్దర్ని తల్లి గుర్తుపట్టిందని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన గంటల్లోనే పోలీసులు రంగంలోకి దిగి, కామాంధులను అదుపులోకి తీసుకున్నారు. 11 మంది నిందితులను నిన్న అర్ధరాత్రే అదుపులోకి తీసుకోగా, మిగిలిన వారిని ఈ ఉదయం అరెస్ట్ చేశారు. ఈ ఘోరానికి పాల్పడ్డవారిని పట్టుకోవడంలో పోలీసులకు స్థానికులు కూడా సహకరించారు. 
gang rape
bihar
gaya

More Telugu News