Susrat Bharucha: సెల్ఫీ కావాలంటూ వచ్చి హీరోయిన్ తో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడు!

  • నటి నుష్రత్ భరూచాకు వేధింపులు
  • పుణెలో జరిగిన ఈవెంట్ లో ఘటన
  • తెలుగులో 'తాజ్ మహల్'లో నటించిన నుష్రత్
సెల్ఫీ దిగుతానంటూ వచ్చిన ఓ అభిమాని కోరికను కాదనలేకపోయిన తాను, అతను చేసిన పనికి షాక్ కు గురయ్యానని హీరోయిన్ నుష్రత్ భరూచా వాపోయింది. తెలుగులో శివాజీ సరసన 'తాజ్ మహల్' సినిమాలో నటించిన ఈ భామ, పూణెలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన వేళ, ఈ ఘటన జరిగింది.

జరిగిన ఘటనపై నుష్రత్ మాట్లాడుతూ, ఓ వ్యక్తి సెల్ఫీ కావాలని అడిగాడని, తాను అంగీకరించి, ఫొటో దిగుతున్న సమయంలో అతను మరింత దగ్గరగా వచ్చి, తన నడుమును తాకాడని చెప్పింది. తాను దిగ్భ్రాంతికి గురికాగా, ఈలోగా ఈవెంట్ టీం సభ్యుడొకరు వచ్చి, సదరు యువకుడిని మందలించి, దూరం జరగాలని హెచ్చరించాడని చెప్పింది. అభిమానులు తనతో సెల్ఫీలకు ఉత్సాహం చూపుతుంటారని, తాను కూడా వారి కోరికను మన్నిస్తుంటానని, కానీ, ఈసారి మాత్రం తనకు చేదు అనుభవం ఎదురైందని వెల్లడించింది.
Susrat Bharucha
Harrasment
Selfy
Pune

More Telugu News