Xiomi: 'ఢాం' అన్న మరో రెడ్ మీ స్మార్ట్ ఫోన్!

  • శంషాబాద్ లో ఘటన
  • ఇటీవలే కొత్త ఫోన్ కొన్న యువకుడు
  • పొగలు వచ్చి పేలిపోయిన ఫోన్
మొన్న విశాఖ, నిన్న విజయవాడ, బెంగళూరు... నేడు తెలంగాణలోని శంషాబాద్. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ మార్కెటింగ్ చేస్తున్న రెడ్ మీ ఫోన్లు వరుసగా పేలుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజా ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, శంషాబాద్ కు చెందిన చిట్టిబాబు అనే యువకుడు ఇటీవలే 'రెడ్ మీ 4 ఏ' స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేశాడు.

అతను కూరగాయల మార్కెట్ లో ఉన్న వేళ, సెల్ ఫోన్ రింగ్ అయింది. బయటకు తీస్తుంటే ఫోన్ నుంచి పొగలు వస్తూ కనిపించడంతో, దాన్ని కింద పడేశాడు. చూస్తుండగానే అది పేలిపోయింది. ఈ ఘటనపై కంపెనీకి ఫిర్యాదు చేసిన చిట్టిబాబు, అది జేబులో పేలుంటే తన ప్రాణాలు పోయుండేవని వాపోయాడు.
Xiomi
Phone
Blast
Smart Phone
Shamshabad

More Telugu News