Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • గీతామాధురికే ఎక్కువ పారితోషికం?
  • 100 కోట్ల బడ్జెట్టుతో బన్నీ సినిమా 
  • పుస్తక రూపంలో ఏఆర్ రెహ్మాన్ విజయగాథ  
  • నాదెండ్ల పాత్రలో బాలీవుడ్ నటుడు
*  'బిగ్ బాస్ 2' రియాల్టీ షోలో పాల్గొంటున్న గాయని గీతామాధురి 20 లక్షల పారితోషికాన్ని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ షోలో పాల్గొంటున్న వారిలో అందరిలోకీ ఆమెకే ఎక్కువ పారితోషికం ముడుతోందట.  
*  అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని విక్రం కుమార్ దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రాన్ని సుమారు 100  కోట్ల భారీ బడ్జెట్టుతో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
*  ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ జీవితంపై ఓ పుస్తకం వెలువడనుంది. చెన్నయ్ కి చెందిన కృష్ణ త్రిలోక్ అనే ఇరవై నాలుగేళ్ల కుర్రాడు 'నోట్స్ ఆఫ్ ఏ డ్రీమ్:ద ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ ఏఆర్ రెహ్మాన్' పేరిట ఈ పుస్తకాన్ని రాస్తున్నాడు. ఆగస్టులో దీనిని రిలీజ్ చేస్తారు.
*  క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ టైటిల్ పాత్రలో రూపొందుతున్న 'ఎన్టీఆర్' బయోపిక్ లో నాదెండ్ల భాస్కరరావు పాత్రను బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ పోషించనున్నట్టు సమాచారం. అలాగే, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుబాటి కనిపిస్తాడు. 
Geetha Madhuri
Allu Arjun
Rehman

More Telugu News