Chandrababu: జగన్‌కి వస్తోన్న ప్రజాదరణను చూసి చంద్రబాబు భయపడుతున్నారు!: లక్ష్మీపార్వతి

  • రూ.4 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు
  • రాష్ట్రంలో అందరినీ మోసం చేశారు
  • జగన్‌కి వస్తోన్న ప్రజాదరణను చూసి భయపడుతున్నారు
  • టీడీపీని నందమూరి వారసులకు అప్పజెప్పాలి 
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈరోజు హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ... నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు రూ.4 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని అన్నారు. రాష్ట్రంలో ఆయన అందరినీ మోసం చేశారని, వైసీపీ అధినేత జగన్‌కి వస్తోన్న ప్రజాదరణను చూసి భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీని నందమూరి వారసులకు అప్పజెప్పాలని, చంద్రబాబు నాయుడికి సొంత జెండా లేదని అన్నారు. ఆయనకు పాలించే అర్హత కూడా లేదని అన్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. 
Chandrababu
laxmi parvathi
Telugudesam
YSRCP

More Telugu News