Jagan: ఖనిజ సంపదను బ్రేక్‌ ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ లా మింగేశారు: జగన్‌పై లోకేశ్‌ సెటైర్‌

  • సహజ వనరులు దోచుకుంటున్నారని అనడం హాస్యాస్పదం
  • ఏ1 దోచుకోకుండా మిగిల్చింది ఏదైనా ఉందా?
  • ఇసుక, ఖనిజాలు, సున్నపురాయిలను కాజేశారు 
  • 13 ఛార్జిషీట్లలో జగన్‌ దోచుకున్న మెనూ మొత్తం ఉంది
సహజ వనరులను టీడీపీ నేతలు కాజేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో చేసిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్‌ మండిపడ్డారు. తాజాగా ఆయన ట్వీట్‌ చేస్తూ... "సహజ వనరులు దోచుకుంటున్నారని ఏ1 అనడం హాస్యాస్పదంగా ఉంది. అసలు ఈ రాష్ట్రంలో మీరు దోచుకోకుండా మిగిల్చింది ఏదైనా ఉందా? ఇసుక, ఖనిజాలు, సున్నపురాయి వంటి ఖనిజ సంపదలను బ్రేక్‌ ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ లా మింగేశారు" అని ఎద్దేవా చేశారు. 13 ఛార్జిషీట్లలో ఆయన దోచుకున్న మెనూ మొత్తం ఉందని అన్నారు. కాగా, కొన్ని రోజులుగా ట్విట్టర్‌లో లోకేశ్‌ యాక్టివ్‌గా ఉంటూ... ప్రతిపక్ష నేతలు చేస్తోన్న విమర్శలను తిప్పికొడుతున్నారు.           
Jagan
Nara Lokesh
Andhra Pradesh

More Telugu News