junior ntr: మూడేళ్ల క్రితం నేను పడ్డ టెన్షన్.. ఇప్పుడు అన్నయ్య పడుతున్నట్టు ఉంది: జూనియర్ ఎన్టీఆర్

  • 'నాన్నకు ప్రేమతో' సినిమాలో నా గెటప్ ను ఆదరిస్తారో, లేదో అని చాలా టెన్షన్ పడ్డా
  • నిజాయతీగా పని చేస్తే ప్రేక్షక దేవుళ్లు ఆదరిస్తారు
  • 'నా నువ్వే' సినిమా పెద్ద హిట్ అవుతుంది
'నాన్నకు ప్రేమతో' సినిమా సమయంలో తన కొత్త గెటప్ ను అభిమానులు ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారో అని తాను టెన్షన్ పడ్డానని జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు. ఇప్పుడు అన్నయ్య కల్యాణ్ రామ్ కూడా అదే టెన్షన్ అనుభవిస్తున్నట్టు తనకు అనిపిస్తోందని చెప్పాడు. అన్నయ్య టెన్షన్ పడాల్సిన అవసరం లేదని... ప్రేక్షక దేవుళ్లది పెద్ద మనసని... నిజాయతీగా మనం కష్టపడితే, కష్టాన్ని గుర్తించి వారు పెద్ద పీట వేస్తారని తెలిపారు. కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన 'నా నువ్వే' ప్రీరిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడుతూ తారక్ ఈ మేరకు వ్యాఖ్యానించాడు.

'నా నువ్వే' సినిమాలో అన్నయ్య పడిన కష్టం, టెన్షన్ వృథాగా పోదని తారక్ అన్నాడు. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని ఆకాంక్షించాడు. ఇలాంటి చిత్రంలో నటించాలనే అన్నయ్య కోరికను నిజం చేసిన దర్శకుడు జయేంద్రకు థ్యాంక్స్ చెబుతున్నానని తెలిపాడు. ఇలాంటి ప్రయత్నం చేయాలంటే దర్శక నిర్మాతలకు ఎంతో ధైర్యం ఉండాలని చెప్పాడు.
junior ntr
tarak
kalyan ram
naa nuvve
movie

More Telugu News