Nani: 'బిగ్ బాస్ లోకి రాకుండా శ్రీరెడ్డిని అడ్డుకున్న నాని'... ఆరోపణలపై స్టార్ మా స్పందన!

టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై పోరాడుతున్న నటి శ్రీరెడ్డి, బిగ్ బాస్ రెండో సీజన్ హోస్ట్, హీరో నానిల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలూ హద్దులు దాటిన వేళ, తనను బిగ్ బాస్ హౌస్ లోకి ఎంపిక చేసినప్పటికీ, దాన్ని నాని అడ్డుకున్నారని శ్రీరెడ్డి చేసిన విమర్శలపై ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసే తెలుగు టీవీ చానల్ 'స్టార్ మా' యాజమాన్యం స్పందించింది.

'బిగ్‌ బాస్‌' 2వ సీజన్ పోటీదారుల గురించి వివరించిన 'స్టార్ మా' వర్గాలు, తాము మొత్తం 125 మంది పేర్లను పరిశీలించామని, వారిలో శ్రీరెడ్డి పేరు కూడా ఉందని స్పష్టం చేశాయి. పేరును పరిశీలించినంత మాత్రాన ప్రతి ఒక్కరికీ అవకాశం ఇవ్వలేమని, కంటెస్టంట్స్‌ జాబితాలో ఎవరిని ఉంచాలి? ఎవరిని ఉంచవద్దు? అన్న విషయాల్లో నాని ఎప్పుడూ కలుగ జేసుకోలేదని వెల్లడించాయి. కాగా, నానితో తనకున్న సంబంధాలపై శ్రీరెడ్డి, రాయడానికి వీల్లేని భాషలో సోషల్ మీడియాలో నిన్న పెట్టిన పోస్టులు పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.
Nani
Sri Reddy
Tollywood
Big Boss
Season-2
Star Maa

More Telugu News