Rahul Gandhi: వాజ్‌పేయిని చూడడానికి.. ఎయిమ్స్‌కి వెళ్లిన అమిత్‌ షా, రాహుల్‌ గాంధీ

  • వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న అమిత్‌ షా
  • వైద్యులతో మాట్లాడిన బీజేపీ జాతీయాధ్యక్షుడు
  • అమిత్‌ షా వెళ్లగానే ఎయిమ్స్‌కు రాహుల్‌
భారత మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయి సాధారణ వైద్య పరీక్షల కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌ లో చేరిన విషయం తెలిసిందే. ఆయనను చూసి వివరాలు తెలుసుకోవడానికి భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా ఎయిమ్స్‌కు వెళ్లారు. వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై అక్కడి వైద్యులతో కాసేపు చర్చించి, వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం కొద్ది సేపటికే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎయిమ్స్‌కు వెళ్లారు. కాసేపట్లో ఆయన వాజ్‌పేయిని కలవనున్నట్లు తెలుస్తోంది. కాగా, అనారోగ్యంతో బాధపడుతోన్న వాజ్‌పేయి కొన్నేళ్లుగా మంచానికే పరిమితమైన విషయం తెలిసిందే.                      
Rahul Gandhi
amith shah
New Delhi

More Telugu News