leech: వ్యక్తి ముక్కులోంచి రక్తం పీల్చే జలగను తొలగించిన డాక్టర్.. ఒళ్లు జలదరించే వీడియో చూడండి!

  • వారం రోజులుగా ముక్కులోంచి కారుతున్న రక్తం
  • భార్య చెప్పిన మాటతో ఆసుపత్రికి వెళ్లిన వ్యక్తి
  • ముక్కు నుంచి జలగను బయటకు లాగిన డాక్టర్
51 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి ముక్కులోంచి పెద్ద సైజులో ఉన్న ఓ రక్తం పీల్చే జలగను డాక్టర్ తొలగించారు. ఇది చైనాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, గత వారం రోజులుగా సదరు వ్యక్తి ముక్కులోంచి రక్తం కారుతోంది. ముక్కు నుంచి ఏదో బయటకు వచ్చి, వెంటనే లోపలకు వెళ్లిపోయిందంటూ అతనికి ఆయన భార్య తెలిపింది. దీంతో చివరకు ఆయన ఆసుత్రికి వెళ్లాడు. అతని ముక్కును పరిశీలించిన డాక్టర్ షాక్ కు గురయ్యారు. ముక్కు నుంచి రక్తం ఎందుకు కారుతోందో అతనికి అర్థమైంది. వెంటనే, అతని ముక్కులో ఉన్న జలగను బయటకు తీశారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.
leech
doctor
china
pull out

More Telugu News