‘పోలవరం’ అంతా అవినీతిమయం.. ముడుపుల మాయ: వైవీ సుబ్బారెడ్డి ఆరోపణ
పోలవరం ప్రాజెక్టు అంతా అవినీతిమయం, ముడుపుల మాయ అని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదని, దోచుకోవాలనే ఉద్దేశంతోనే కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును చంద్రబాబు తీసుకున్నారని ఆరోపించారు.
కొత్త నిర్మాణ సంస్థకు నామినేషన్‌పై మూడు రెట్లు పెంచి ఇవ్వడం అందులో భాగమేనని, పోలవరం ప్రాజెక్టు అక్రమాలను కాగ్ వెలుగులోకి తీసుకువచ్చిందని, ‘పోలవరం’ను 2019 లోపు కేంద్రమే నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఎమ్మెల్యేల అవినీతి తారస్థాయికి చేరుకుందని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు అనుభవం ఉపయోగపడుతుందని పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాల్లోనూ టీడీపీని నెగ్గిస్తే, అందుకు ప్రతిగా చంద్రబాబు ప్రజలను దోచుకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.