బాలకృష్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా: సీఎం చంద్రబాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలకృష్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా: సీఎం చంద్రబాబు

  • నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక శుభాకాంక్షలు
  • బాలకృష్ణ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన చంద్రబాబు
  •  బాలయ్యకు బర్త్ డే విషెస్ చెప్పిన మా అధ్యక్షుడు శివాజీ రాజా 
హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని సీఎం చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబునాయుడు ఓ ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలుగు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని చంద్రబాబు చెప్పారు.

కాగా, బాలకృష్ణను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు శివాజీ రాజా కలిసి బర్త్ డే విషెస్ తెలిపారు. బాలయ్య నివాసానికి వెళ్లి  ‘మా’ తరపున సిల్వర్ జూబ్లీ షీల్ట్ ను అందజేసి శాలువాతో సత్కరించారు. 
Tollywood
Chandrababu
star maa

More Telugu News