'మోదీ హత్యకు ఆరెస్సెస్/గడ్కరీ కుట్ర' దుమారం రేపుతోన్న విద్యార్థిని వ్యాఖ్యలు
- మావోయిస్టులు కుట్ర పన్నారని నిన్న పోలీసుల ప్రకటన
- ఆరెస్సెస్/గడ్కరీపై విద్యార్థిని ఆరోపణలు
- ఆ నిందను ముస్లింలు, కమ్యూనిస్టులపై వేస్తారని ట్వీట్
- ఆ తరువాత ముస్లింలను ఊచకోత కోస్తారేమోనని వ్యాఖ్య
మోదీని హత్య చేసేందుకు ఆరెస్సెస్/గడ్కరీ ప్లాన్ వేస్తున్నారని అనిపిస్తోందని, ఎందుకంటే ఆ నిందను ముస్లింలు, కమ్యూనిస్టులపై వేసి, ముస్లింలను ఊచకోత కోస్తారేమో అని షెహ్లా రషీద్ అనే జేఎన్యూ విద్యార్థి నాయకురాలు ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ వైరల్గా మారడంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గుర్తించారు. ఆమె చేసిన ఈ సామాజిక వ్యతిరేక వ్యాఖ్యలపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నానని ట్వీట్ చేశారు.