Andhra Pradesh: హోదా కోసం వేర్వేరుగా ఉద్యమిస్తే ఢిల్లీ నేతలు నవ్వుతున్నారు: చలసాని శ్రీనివాస్

షార్ట్స్‌లో చూడండి
ఏపీకి ప్రత్యేక హోదా విషయమై వేర్వేరుగా ఉద్యమిస్తే ఢిల్లీ నేతలు నవ్వుతున్నారని, అందరం కలిసి ఉద్యమిద్దామని ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ సూచించారు. విజయవాడలో హోదా, విభజన హామీల సాధన సమితి కార్యవర్గ సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కోసం సాధన సమితి నాలుగేళ్లుగా పోరాడుతోందని, అందరం కలసికట్టుగా పోరాడితే ఫలితం ఉంటుందని అన్నారు. ఈ నెల 15 తర్వాత విద్యార్థి సంఘాలతో కలిసి కాలేజీల్లో చైతన్య సమావేశాలు, జులైలో బస్సు యాత్ర, యూనివర్శిటీల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని, నెలలో ఒకరోజు ర్యాలీలు, జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని అన్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
chalasani

More Telugu News