TTD: శ్రీవారి పవిత్రతను దెబ్బతీయాలని బీజేపీ చూస్తోంది: ఏపీ సీఎం చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
తిరుమల తిరుపతి శ్రీవారి పవిత్రతను దెబ్బతీయాలని బీజేపీ చూస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే తమకు మరో 20 స్థానాలు వచ్చేవని అన్నారు. ఇప్పుడు ఆ పార్టీ అవినీతిపరులతో కలిసి ఏపీని దెబ్బతీయాలని చూస్తోందని అన్నారు.

తాజాగా ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ... విభజన హామీల అమలు కోసం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. స్విస్‌ బ్యాంకులోని నల్లధనాన్ని దేశానికి తీసుకొస్తానని మోదీ ఎన్నికల ముందు చెప్పారని, ఇప్పుడు గాలి జనార్దన్‌ రెడ్డి, జగన్ లాంటి వారిని పక్కన పెట్టుకుని ఆయన ఎటువంటి సందేశం ఇస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. 
Go Back to Shorts
TTD
Chandrababu
BJP

More Telugu News