Chandrababu: తుదిదాకా పోరాడే శక్తి చంద్రబాబుది.. ఆయనను ఓడించడానికి ముందు చాలా శక్తులను ఓడించాలి: బీజేపీ నేత మురళీధరరావు

  • ఎన్నికలకు ఆరు నెలల ముందు ఎన్డీయే నుంచి బయటకు వస్తారని భావించాం
  • కానీ, ఏడాది ముందే ఆయన బయటకు వచ్చారు
  • రాజకీయ కోణంలో చూస్తే, ఆయన చేసింది తప్పేమీ కాదు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఓడించాలంటే సామాన్య విషయం కాదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు అన్నారు. ఆయన్ని ఓడించాలంటే... దానికంటే ముందు ఎన్నో శక్తులను ఓడించాల్సి ఉంటుందని చెప్పారు. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వస్తుందని తాము భావించామని... కానీ, తమ అంచనాలకు భిన్నంగా ఆయన ఏడాదికి ముందే ఎన్డీయే నుంచి బయటకు వచ్చారని తెలిపారు.

రాజకీయ కోణంలో చూస్తే, చంద్రబాబు చేసింది తప్పేమీ కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలనే చంద్రబాబు వ్యూహం ఎంత మేరకు ఫలితాన్నిస్తుందో చెప్పలేమని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీ అస్తిత్వానికే ముప్పు ఉంటుందని... అందుకే, చంద్రబాబు తనదైన శైలిలో రాజకీయ క్రీడను మొదలు పెట్టారని మురళీధరరావు అన్నారు.
Chandrababu
muralidhar rao

More Telugu News