damodar reddy: కాంగ్రెస్ కు షాక్.. నేడు టీఆర్ఎస్ లో చేరనున్న సీనియర్ నేత దామోదర్ రెడ్డి

  • కాంగ్రెస్ కు గుడ్ బై చెపుతున్న దామోదర్ రెడ్డి
  • సాయంత్రం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిక
  • కాంగ్రెస్ లోకి నాగం చేరికను తీవ్రంగా వ్యతిరేకించిన దామోదర్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. సీనియర్ నేత, ఎమ్మెల్సీ కె.దామోదర్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి, టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఆయనతో పాటు ఇతర నేతలు ఎడ్మ కృష్ణారెడ్డి, జాన్ అబ్రహంలు కూడా కారెక్కబోతున్నారు.

 కాంగ్రెస్ పార్టీలోకి నాగం జనార్దనరెడ్డి చేరికను దామోదర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ, పార్టీ నాయకత్వం నాగంను పార్టీలోకి ఆహ్వానించింది. దీంతో, తన మాటకు విలువ లేకుండా పోయిందనే భావనతో పార్టీ మారాలనే నిర్ణయానికి ఆయన వచ్చారు. మరోవైపు, ఇతర పార్టీల్లోని కీలక నేతలను ఆకర్షించేందుకు టీఆర్ఎస్ తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది. తద్వారా 2019 ఎన్నికల నాటికి తెలంగాణలో తిరుగులేని శక్తిగా అవతరించాలనేది టీఆర్ఎస్ భావన.
damodar reddy
kcr
congress
TRS
good bye

More Telugu News