ఆళ్లగడ్డ సీటు చంద్రబాబు చేతిలో పెడతా.. ఆయన ఇష్టం!: అఖిలప్రియ
- నేను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవం
- వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా టీడీపీ నుంచే పోటీ చేస్తా
- చంద్రబాబు చెప్పిన స్థానం నుంచే బరిలోకి దిగుతా
కాగా, మహిళా సంక్షేమం కోసం చంద్రబాబు పాటుపడుతుంటే, మోదీ మాత్రం మహిళలపై దాడులు, అత్యాచారాలు చేయమంటూ రెచ్చగొడుతున్నారని అఖిల ప్రియ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు మండిపడుతున్నప్పటికీ అఖిలప్రియ ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. ప్రధాని మోదీపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, వ్యక్తిగతంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని అఖిలప్రియ అంటున్నారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, దేశంలో, మహిళలకు, బాలికలకు ఎలాంటి రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.