Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చెన్నైలో విజయ్ రికార్డును అధిగమించిన రజనీ

  • నిన్ననే విడుదలైన 'కాలా'
  • రజనీ మార్క్ మూవీగా టాక్ 
  • నెక్స్ట్ మూవీ షూట్ కి రజనీ
రజనీకాంత్ క్రేజ్ ఎప్పుడో ఎల్లలు దాటిపోయింది. ఆయన సినిమా కోసం ఎదురుచూసే అభిమానులు ప్రపంచవ్యాప్తంగా వున్నారు. వివిధ భాషల్లోని స్టార్ హీరోలు సైతం ఆయన సినిమా రిలీజ్ ను చూసుకుని .. తమ సినిమా విడుదలను ప్లాన్ చేసుకుంటారు. అంతగా మార్కెట్ ను ప్రభావితం చేయగల హీరోగా రజనీ కనిపిస్తారు. ఆయన ప్రతి సినిమా ఓపెనింగ్స్ రోజునే కొత్త రికార్డును సృష్టిస్తూ ఉంటుంది. అదే పనిని 'కాలా' కూడా చాలా తేలికగా చేసేసింది. పా రంజిత్ దర్శకత్వం వహించిన 'కాలా' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చెన్నై సిటీలో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ సినిమా తొలి రోజున చెన్నైలో 1.76 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి .. మొదటిస్థానంలో నిలిచింది. ఇప్పటివరకూ ఈ స్థానంలో 1.52 కోట్ల గ్రాస్ తో విజయ్ 'మెర్సల్' ఉండేది. ఈ రికార్డును 'కాలా' అధిగమించి కొత్త రికార్డును నమోదు చేసింది. ఈ సినిమా థియేటర్స్ లో అభిమానులు విజిల్స్ కొడుతూ ఉండగానే, రజనీ తన తదుపరి సినిమా షూటింగులో జాయినైపోవడం విశేషం.    
rajanikanth
huma

More Telugu News