Pakistan: పవన్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చిన గిడ్డి ఈశ్వరి

  • మన్యం అభివృద్ధి చెందిందంటే అది చంద్రబాబు భిక్షే
  • గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలు జరగట్లేదు
  • పవన్ కు రాజకీయ పరిపక్వత లేదు
గిరిజనుల గురించి, ఆ ప్రాంతాల అభివృద్ధి గురించి సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, మన్యం అభివృద్ధి చెందిందంటే అది చంద్రబాబు పెట్టిన భిక్షేనని అన్నారు.

మన్యంలో బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయని పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, ఎటువంటి తవ్వకాలు జరగడం లేదని అన్నారు. పవన్ కల్యాణ్ కు సినీ రంగంలో అనుభవం ఉంటే ఉండొచ్చు కానీ, రాజకీయ రంగంలో మాత్రం పరిపక్వత సాధించలేదని విమర్శించారు. సినిమాల్లో హిట్స్ కొట్టలేకపోవడం వల్లే పవన్ పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
Pakistan
giddi eeswari

More Telugu News