haryana don sampath: హర్యానా డాన్ సంపత్ సెహెరా హైదరాబాద్ లో అరెస్టు

  • ఇరవై రోజులుగా మియాపూర్ లో తలదాచుకుంటున్న సంపత్
  • వలపన్ని పట్టుకున్న సైబరాబాద్, హర్యానా పోలీసులు 
  • అతని వద్ద నుంచి తుపాకులు, మారణాయుధాలు స్వాధీనం  
హర్యానా రాష్ట్రానికి చెందిన డాన్ సంపత్ సెహెరాను హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు. ఇరవై రోజులుగా మియాపూర్ లో తలదాచుకుంటున్న సంపత్ ను సైబరాబాద్, హర్యానా పోలీసులు వలపన్ని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి తుపాకులు, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ లో సంపత్ పై పది హత్య కేసులు, మూడు హత్యాయత్నం కేసులు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులతో పాటు దోపిడీలు, బెదిరింపులకు పాల్పడిన కేసులు కూడా అతనిపై ఉన్నట్టు చెప్పారు.
haryana don sampath
arrest
Hyderabad

More Telugu News