అందుకే జనసేన పార్టీ ఆవిర్భవించింది: పాడేరులో పవన్‌ కల్యాణ్‌

ఉత్తరాంధ్రలో గిరిజన సమస్యలను చూసి కడుపుమండడం వల్లే జనసేన పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. జనపోరాట యాత్ర చేపట్టిన ఆయన ఈరోజు విశాఖపట్నం జిల్లా పాడేరులో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ... గిరిజనుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.

గిరిజన యువతకు సరైన ఉపాధి మార్గాలు లేకే యువత పక్కదారి పడుతోందని, ఐటీడీఏ ఉపాధి మార్గాలు చూపకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. హుకుంపేట మండలం గూడలో మైనింగ్‌ అక్రమ తవ్వకాలు జరుగుతున్నా ఆ విషయాన్ని పట్టించుకోవట్లేదని ఆరోపించారు. అక్కడ యాత్ర ముగించుకున్న పవన్‌ కల్యాణ్‌ మాడుగులకు బయలుదేరారు.


More Telugu News