keerti suresh: సావిత్రిగా కీర్తి సురేశ్ అభినయం అద్భుతం: చరణ్

  • నాగ్ అశ్విన్ అంకితభావం నచ్చింది 
  • కీర్తి సురేశ్ ను మించి ఎవరూ చేయలేరు 
  • నిర్మాతల ప్రయత్నం అభినందనీయం  
కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన 'మహానటి' .. మే 9వ తేదీన భారీస్థాయిలో విడుదలైంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాలలోను .. ఓవర్సీస్ లోను నీరాజనాలు పడుతున్నారు. 'మహానటి' చూసిన సినీ ప్రముఖులంతా ఈ సినిమా టీమ్ కి అభినందనలు తెలిపారు. ముఖ్యంగా చిరంజీవి దర్శక నిర్మాతలను తన ఇంటికి ఆహ్వానించి సత్కరించిన సంగతి తెలిసిందే. బిజీగా ఉండటం వలన కాస్త ఆలస్యంగా చరణ్ ఈ సినిమా చూశాడు. 'మహానటి' చూసిన వెంటనే ఆయన తనదైన శైలిలో ఫేస్ బుక్ ద్వారా స్పందించాడు. 'మహానటి' సినిమా నా మనసును ఎమోషనల్ గా టచ్ చేసింది. నాగ్ అశ్విన్ ఎంతో అంకితభావంతో ఈ సినిమాను తెరకెక్కించాడు. సావిత్రిగా కీర్తి సురేశ్ అద్భుతంగా నటించింది. ఈ పాత్రను ఆమె తప్ప వేరెవరూ ఇంతబాగా చేయలేరనిపించింది. సమంత .. దుల్కర్ సల్మాన్ .. విజయ్ దేవరకొండల నటన కూడా ఎంతో సహజంగా వుంది. ఇంతగొప్ప చిత్రాన్ని అందించిన నిర్మాతలకి శుభాకాంక్షలు" అని రాసుకొచ్చాడు.
keerti suresh
dulquer salman

More Telugu News