Jagan: వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో తేనెటీగల కలకలం!

  • పెరవలి మండలం కానూరులో జగన్‌ 
  • ఒక్కసారిగా దాడి చేసిన తేనెటీగలు
  • 10 మందికి గాయాలు
నిన్న పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, నిడదవోలులో పాదయాత్ర చేసిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి ఈరోజు పెరవలి మండలం కానూరు కొండాలమ్మ గుడి వద్ద తన యాత్ర ప్రారంభించారు. కాగా, గుడి వద్ద తేనెటీగలు కలకలం రేపాయి. ఒక్కసారిగా అవి దాడి చేయడంతో జగన్‌ను వాటి బారి నుంచి స్థానికులు, పోలీసులు పక్కకు తీసుకెళ్లారు. వాటి దాడితో 10 మందికి గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో జోరువానను సైతం లెక్కచేయకుండా జగన్‌ ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు.      
Jagan
YSRCP
West Godavari District

More Telugu News