Tollywood: బాలీవుడ్, టాలీవుడ్‌, కోలీవుడ్‌ వంటి పేర్లు వద్దు: బీజేపీ నేత కైలాష్ విజయ్ వర్జియా డిమాండ్

  • బాలీవుడ్‌ పేరును బీబీసీ వాళ్లు తొలిసారిగా ప్రచారం చేశారు
  • వారిలో హాలీవుడ్‌ చిత్రాలను కాపీకొడుతున్నామన్న భావన 
  • మనల్ని మనం కించపరుచుకున్నట్లే
బాలీవుడ్‌ పేరును మార్చేయాలని కోరుతూ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్‌కి బీజేపీ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయ్ వర్జియా లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను ఇటీవల ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘాయ్ కలవడానికి వచ్చారని, ఆయనతో మాట్లాడుతోన్న సమయంలో బాలీవుడ్‌ ప్రస్తావన వచ్చిందని, అప్పట్లో బాలీవుడ్‌ పేరును బీబీసీ మీడియా వాళ్లు తొలిసారిగా ప్రచారం చేసినట్లు తనకు తెలిపారని అన్నారు.

హాలీవుడ్ సినిమాలను మన హిందీ సినీ పరిశ్రమ కాపీ కొట్టి తీస్తుందన్న భావనతో వారు ఆ పేరు పెట్టారని, ఒకవేళ మనం బాలీవుడ్‌ పేరు వాడితే మనల్ని మనం కించపరుచుకున్నట్లేనని కైలాష్ విజయ్ వర్జియా అన్నారు. అలాగే హాలీవుడ్‌కి కాపీ పేర్లలా ఉన్న టాలీవుడ్, కోలీవుడ్‌ల వంటి పదాలను కూడా వాడకూడదని అన్నారు.
Tollywood
Bollywood
BJP

More Telugu News