sai dharam tej: మెగా హీరో ఆ మూవీ నుంచి తప్పుకుంది అందుకేనట!

  • మైత్రీ మూవీ మేకర్స్ తో చంద్రశేఖర్ యేలేటి 
  • కథానాయకుడిగా నితిన్ 
  • త్వరలో పూర్తి వివరాలు
దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి పేరు వినగానే 'ఐతే' .. 'అనుకోకుండా ఒకరోజు' .. 'మనమంతా' వంటి సినిమాలు గుర్తుకువస్తాయి. విభిన్నమైన కథలను ఎంచుకుని వాటిని తనదైన శైలిలో ఆయన ఆవిష్కరిస్తూ ఉంటాడు. చాలావరకూ ఆయన సినిమాల్లో కథలే ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి. అలాంటి చంద్రశేఖర్ యేలేటి .. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఒక కథను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాలో హీరోగా సాయిధరమ్ తేజ్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే హీరోయిజానికన్నా కథకే అధిక ప్రాధాన్యత ఉండటంతో,ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడట. ఆ తరువాత గోపీచంద్ ను సంప్రదించగా ఆయన కూడా ఈ కారణంగానే పెద్దగా ఆసక్తిని చూపలేదని సమాచారం. ఈ నేపథ్యంలో నితిన్ ను సంప్రదించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.          
sai dharam tej

More Telugu News