విద్యావంతుడైన ప్రధానిని మనం కోల్పోయాం: కేజ్రీవాల్
- మన్మోహన్ సింగ్ లాంటి విద్యావంతుడిని కోల్పోయాం
- మళ్లీ ఆయనే ప్రధాని కావాలని దేశం కోరుకుంటోంది
- మోదీ డిగ్రీ నకిలీదంటూ గతంలో వ్యాఖ్యానించిన కేజ్రీ
గతంలో కూడా మోదీ విద్యార్హతలపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. మోదీ డిగ్రీ నకిలీదంటూ విమర్శించారు. ఇప్పుడు మరోసారి విద్యార్హతల గురించి కేజ్రీవాల్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. పతనమవుతున్న రూపాయి విలువ దేశీయ పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే అంశంపై ఓ జాతీయ మీడియా కథనాన్ని రాసింది. ఈ నేపథ్యంలోనే, కేజ్రీవాల్ తనదైన శైలిలో మోదీపై సెటైర్లు వేశారు.