'బిగ్ బాస్' హౌస్ లోకి శ్రీరెడ్డి, చార్మి, రాశి, రాజ్ తరుణ్... కంటెస్టెంట్ల జాబితా ఇది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'బిగ్ బాస్' హౌస్ లోకి శ్రీరెడ్డి, చార్మి, రాశి, రాజ్ తరుణ్... కంటెస్టెంట్ల జాబితా ఇది!

  • జూన్ 10 నుంచి బిగ్ బాస్ రెండో సీజన్
  • 100 రోజుల పాటు సాగనున్న రియాలిటీ షో
  • జాబితా ఇదంటూ సోషల్ మీడియాలో లీక్
ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా తెలుగు టీవీ ప్రేక్షకులను రియాలిటీ షో 'బిగ్ బాస్‌' ఎంతగా అలరించిందో అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్, టీఆర్పీ రేటింగ్స్ రావడంతో, రెండో సీజన్ ను జూన్ 10 నుంచి ప్రారంభించాలని నిర్వాహకులు నిర్ణయించారు. రెండో సీజన్ కు హీరో నాని యాంకర్ గా వ్యవహరించనుండగా, 100 రోజుల పాటు, 16 మంది సెలబ్రిటీలు బిగ్ బాస్ లో గడపనున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అన్ని హంగులతో కూడిన సెట్ ఇప్పటికే పూర్తయింది.

ఇక ఈ కార్య‌క్ర‌మంలో పార్టిసిపేట్ చేసే వారి జాబితా అంటూ, సోషల్ మీడియాలో ఓ లీక్ హల్ చల్ చేస్తోంది. హీరోలు రాజ్ త‌రుణ్, వరుణ్ సందేశ్, ఆర్యన్ రాజేష్ లతో పాటు సింగ‌ర్ గీతా మాధురి, యాంక‌ర్ శ్యామ‌ల, రాశి, చార్మికౌర్, గజాలా, చాందినీ చౌదరి, శ్రీరెడ్డి, ధ‌న్య బాల‌కృష్ణ‌, జూనియ‌ర్ శ్రీదేవి, థ‌నీష్ , వైవా హ‌ర్ష, క‌మెడీయ‌న్ వేణులుంటారని తెలుస్తోంది. అయితే, ఈ జాబితాపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. 
Big Boss
Reality Show
Nani
Tollywood

More Telugu News