బ్యాంక్ వద్ద క్యాష్ బ్యాగ్‌ను చోరీ చేసిన కోతి!
- ఆగ్రాలో ఘటన
- బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వచ్చిన వ్యక్తి
- ఒక్కసారిగా బ్యాగు అందుకుని పారిపోయిన కోతి
దీంతో షాక్ అయిన బన్సాల్ తో పాటు అక్కడున్న మరి కొందరు ఆ కోతి వెనుక పరుగులు తీసినా లాభం లేకుండా పోయింది. దీని గురించి చెబుతూ, బ్యాంక్ వద్ద తనకు కొన్ని కోతులు తారసపడ్డాయని, హఠాత్తుగా ఒక కోతి వచ్చి తన బ్యాగ్‌ను లాక్కెళ్లిందని, అది మెట్లు ఎక్కుతుండగా బ్యాగులోంచి రూ.60,000 కిందపడ్డాయని, మిగతా 1,40,000 రూపాయలు తనకు దక్కలేదని బాధితుడు చెప్పాడు.
అంతేగాక, ఆ కోతులు తనపై దాడి కూడా చేశాయని బాధితుడు అన్నాడు. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు కోతులపాలు అయిందని, పోలీసులు వచ్చినప్పటికీ లాభం లేకుండా పోయిందని చెప్పాడు. కాగా, ఆగ్రాలో కోతుల బెడద పెరిగిపోయింది. ఇటువంటి ఘటనలు తరుచూ జరుగుతున్నాయి.