కడియం శ్రీహరి వ్యాఖ్యలపై జనగామ జర్నలిస్టుల ఆగ్రహం.. ఆయన కార్యక్రమాలకు వెళ్లరాదని నిర్ణయం!
- ప్రభుత్వ కార్యక్రమంలో సరైన ఏర్పాట్లు చేయలేదని అలిగిన జర్నలిస్టులు
- రావాలని పిలిచినా కదలని వైనం
- జర్నలిస్టులు అతి చేస్తున్నారంటూ శ్రీహరి వ్యాఖ్యలు
- నిరసన వ్యక్తం చేస్తూ, వ్యతిరేకంగా నినాదాలు చేసిన జర్నలిస్టులు
దీన్ని గమనించిన కడియం శ్రీహరి జర్నలిస్టులను పిలవాలంటూ అధికారులకు చెప్పారు. వారు జర్నలిస్టుల వద్దకు వచ్చి కోరినా... జర్నలిస్టులు అక్కడి నుంచి కదల్లేదు. చివరకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వచ్చి జర్నలిస్టులతో మాట్లాడుతుండగా.... కడియం శ్రీహరి కల్పించుకుని జర్నలిస్టులు అతిగా ప్రవర్తిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. టైమ్ వేస్ట్ చేయవద్దని, జర్నలిస్టులు రాకపోయినా మీరు వచ్చేయండని అన్నారు. దీంతో ఆగ్రహించిన జర్నలిస్టులు బయటకు వచ్చి కడియం శ్రీహరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇకపై జిల్లాలో శ్రీహరి సమావేశాలకు వెళ్లరాదని నిర్ణయించారు.