Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అవకాశాలు వస్తూనే వున్నాయి .. నేనే స్పీడ్ తగ్గించాను: రాజ్ తరుణ్

  • రాజ్ తరుణ్ హీరోగా 'రాజుగాడు'
  • కథానాయికగా అమైరా దస్తూర్ 
  • జూన్ 1వ తేదీన భారీ విడుదల           
కెరియర్ ఆరంభంలో వరుస సినిమాలు చేస్తూ .. వరుస విజయాలను అందుకుంటూ రాజ్ తరుణ్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. అలాంటి రాజ్ తరుణ్ ఈ మధ్య తన దూకుడు తగ్గించినట్టుగా కనిపిస్తోంది. ఆయన తాజా చిత్రంగా 'రాజుగాడు' జూన్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో దొంగతనం చేయడమనే బలహీనత కలిగిన 'రాజు' అనే పాత్రలో నేను కనిపిస్తాను. ఈ సినిమాకి సంబంధించిన వినోదమంతా ఈ పాయింట్ పైనే ఆధారపడి ఉంటుంది. ఈ సినిమా యూత్ తో పాటు మాస్ ఆడియన్స్ కి బాగా చేరువవుతుందని భావిస్తున్నాను. అమైరా దస్తూర్ కి కూడా ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుందని నమ్ముతున్నాను. ఇంతకుముందులానే ఇప్పుడూ అవకాశాలు వస్తున్నాయి. ఒక సినిమా పూర్తయిన తరువాతనే మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. అందువల్లనే నా దూకుడు తగ్గినట్టుగా అనిపిస్తుందే తప్ప .. వేరే కారణమేమీ లేదు" అని చెప్పుకొచ్చాడు.           
raj tarun
amyra dastur

More Telugu News