హైదరాబాద్ నిర్మాణానికి భూమిపూజ చేసిన నిజాంరాజు కూడా చంద్రబాబులా చెప్పుకోలేదు!: మంత్రి జగదీశ్ రెడ్డి

  • హైదరాబాద్‌ను నిర్మించానని చెప్పుకోవడం హాస్యాస్పదం
  • శతాబ్దాలుగా ఎంతో మంది కృషి వల్లే నగర నిర్మాణం సాధ్యం
  • చంద్రబాబు పగటి కలలు కంటున్నారు
హైదరాబాద్ నగరాన్ని తానే నిర్మించానని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. అప్పట్లో హైదరాబాద్ నిర్మాణానికి భూమిపూజ చేసిన నిజాం రాజు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఎద్దేవా చేశారు. ఈ రోజు సూర్యాపేటలో జగదీశ్‌ రెడ్డి మాట్లాడుతూ... శతాబ్దాలుగా ఎంతో మంది కృషి వల్లే నగర నిర్మాణం సాధ్యం అవుతుందని అన్నారు.

టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకవేళ తమ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించి పోటీ చేస్తే ఏపీలో కూడా తమ పార్టీ సత్తా చాటుతుందని వ్యాఖ్యానించారు. టీడీపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని చంద్రబాబు పగటి కలలు కంటున్నారని, ఈ రాష్ట్రంలో టీడీపీ తుడుచుకు పెట్టుకుపోయిందని అన్నారు.  
Go Back to Shorts
Hyderabad
jagadishreddy
TRS

More Telugu News