విలేకరి అందాన్ని పొగిడిన టీవీ యాంకర్.. ఉద్యోగం కోల్పోయిన వైనం!
- విలేకరితో హ్యాండ్సమ్గానే ఉన్నావని అన్న యువతి
- విషయం తెలుసుకుని మండిపడ్డ ఎంపీ
- యువకుడిని పొగడడం ఏంటని ఆగ్రహం
- కువైట్కు చెందిన ఓ టీవీ చానెల్లో ఘటన
అయితే, ఆ విలేకరి మాట్లాడటానికి ముందు తన తలపాగా సరిగ్గా ఉందో లేదో చూసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన బసిమా.. హాండ్సమ్గానే ఉంటావు కదా.. తలపాగా సరిచేసుకుని రెడీ మళ్లీ అవ్వాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించింది. ఈ విషయం అక్కడి ఎంపీకి తెలిసింది.
ఓ అమ్మాయి ఇలా ఓ వ్యక్తిని హ్యాండ్సమ్గా ఉన్నావంటూ అనడం ఏంటని ఈ విషయాన్ని తమ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఆమెను జాబ్ నుంచి తీసేయాలని ఆ టీవీ యాజమాన్యానికి హెచ్చరికలు వచ్చాయి. చివరకు ఆమెను విధుల నుంచి తొలగించారు.