Chandrababu: రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే నన్ను ఇలా చేస్తున్నారు: మోత్కుపల్లి ఆగ్రహం

  • నన్ను టీడీపీ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు
  • నేను 30 ఏళ్లుగా టీడీపీ కోసం నిజాయతీగా పని చేస్తున్నాను
  • నాకు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా అవమానపరుస్తున్నారు
తమ పార్టీలోంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే తనను ఇలా చేస్తున్నారని టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనను టీడీపీ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

 తాను 30 ఏళ్లుగా టీడీపీ కోసం నిజాయతీగా పని చేస్తున్నానని, ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం తనతో 5 నిమిషాలు మాట్లాడడానికి కూడా ఒప్పుకోవట్లేదని, అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా అవమాన పరుస్తున్నారని అన్నారు. తాను చేసిన తప్పేంటని మోత్కుపల్లి ప్రశ్నించారు. తాను చంద్రబాబును నమ్మి చాలా కోల్పోయానని, దళితుడిని కాబట్టే తనను అవమాన పరుస్తున్నారని ఆరోపించారు.
Chandrababu
Telugudesam
mothkupalli

More Telugu News