West Godavari District: చంద్రబాబు గారూ.. ఇది చెరుకురసం కాదు, తాగే మంచినీళ్లు!: వైఎస్ జగన్

  • చుట్టూ నీళ్లు కనిపిస్తాయి కానీ, తాగడానికి గుక్కెడు నీళ్లుండవు!
  • తాగునీటిని కొనుక్కోవాల్సిన పరిస్థితిలో పేదలు ఉన్నారు!
  • మీ నాలుగేళ్ల పాలన రాక్షసపాలన 
నాలుగేళ్లుగా చంద్రబాబు తమ నియోజకవర్గానికి చేసిందేమిటని ప్రజలు, రైతులు వాపోతున్నారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడులో ప్రజా సంకల్ప యాత్రలో జగన్ మాట్లాడుతూ, ‘మంచినీళ్లు దొరకని పరిస్థితిలో ఉన్నామని ప్రజలు చెబుతున్నారు. ‘మేము తాగుతున్న నీళ్లు ఇవి అన్నా!’ అంటూ బాటిల్స్ తీసుకొచ్చి నాకు చూపిస్తున్నారు. చంద్రబాబు గారూ.. ఈ బాటిల్ లో ఉన్నది చెరుకురసం కాదు... తాగే మంచినీళ్లు!

ఇదే నియోజకవర్గం చుట్టూ నీళ్లు కనిపిస్తాయి కానీ, తాగడానికి గుక్కెడు నీళ్లుండవు! గోదావరి నీళ్లు చూస్తే.. వర్షాకాలం తప్ప ఎప్పుడూ వదిలిపెట్టరు. బోర్లు వేస్తే ఉప్పునీళ్లు... తాగునీటిని కొనుక్కోవాల్సిన పరిస్థితిలో పేదలు ఉన్నారంటే ఎంత దారుణం! చంద్రబాబునాయుడు గారిని మీ అందరి తరపున నేను అడుగుతున్నాను.. రాజశేఖర్ రెడ్డిగారి పాలన రామరాజ్యం కాదా? అని అడుగుతున్నాను. మీ నాలుగేళ్ల పాలన రాక్షసపాలన కాదా?’ అని నిలదీశారు.
West Godavari District
jagan

More Telugu News