suman: ఇప్పుడొస్తోన్న కుర్రాళ్లు దర్శకులకే చెప్పేస్తున్నారు: సుమన్

  • మా అప్పుడున్న పద్ధతి వేరు 
  • ఇప్పుడున్న పరిస్థితి వేరు 
  • మేం సెట్లో టైమ్ వేస్ట్ చేసేవాళ్లం కాదు

యాక్షన్ హీరోగా నూటికి నూరు మార్కులు కొట్టేసిన సుమన్ .. ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువై ఘన విజయాలను అందుకున్నారు. అలాంటి సుమన్ తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. " చిత్రపరిశ్రమలో అప్పటికీ .. ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడొస్తోన్న కొత్త కుర్రాళ్లలో కొంతమంది షూటింగుకు లేట్ గా రావడం .. సెట్లో ఆర్గ్యూ చేయడం .. డైరెక్టర్ కే సూచనలు ఇవ్వడం చూస్తున్నాను"

"అప్పట్లో ఇలాంటివేమీ మేం చేయలేదు. ఒక సినిమా ఒప్పుకుంటే డైరెక్టర్ తో కూర్చుని కేరక్టర్ ఏంటి? .. కాస్ట్యూమ్స్ ఏంటి? .. గెటప్ ఏంటి? అనే విషయాలను ముందుగానే క్లియర్ గా మాట్లాడుకునే వాళ్లం. మర్నాడు చేయబోయే సీన్స్ గురించి ఏదైనా డౌట్ వుంటే, ముందురోజే అడిగి తెలుసుకునేవాళ్లం. సెట్లోకి వచ్చాక మాత్రం ఆ విషయాలను గురించి వాదిస్తూ సమయాన్ని ఎంత మాత్రం వృథా చేసేవాళ్లం కాదు" అంటూ చెప్పుకొచ్చారు.     

More Telugu News