Special Category Status: అదే రోజున చంద్రబాబు దీక్ష చేశారు.. ఇది సరైంది కాదు!: చలసాని శ్రీనివాస్‌

  • రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టాలి
  • ఏపీకి ప్రత్యేక హోదా కోసం పని చేయాలి
  • కర్ణాటక ఎన్నికలు బీజేపీకి బుద్ధి చెప్పాయి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం 'హోదా' సాధన సమితి ఆందోళనలు కొనసాగిస్తోంది. గుంటూరు అరండల్‌పేటలో ఈ రోజు జరిగిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న 'హోదా' సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ... తాము హోదా కోసం ఆందోళనలు ప్రారంభించిన రోజే మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్ష చేశారని, ఇది సరైంది కాదని వ్యాఖ్యానించారు.

తమ రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజకీయ పార్టీలన్నీ పని చేయాలని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి బుద్ధి చెప్పాయని, కేంద్ర ప్రభుత్వంపై ఇదే సమయంలో ఒత్తిడి పెంచాలని పిలుపునిచ్చారు. తాము త్వరలోనే బస్సు యాత్ర చేపడతామని తెలిపారు.
Special Category Status
Chandrababu
Andhra Pradesh

More Telugu News