Chandrababu: చంద్రబాబు చేసిన పనికి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది!: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

  • బెంగళూరు విధానసౌధ వేదికగా కాంగ్రెస్, టీడీపీలు ఏకమయ్యాయి
  • రహస్యంగా సాగిన చీకటి ఒప్పందాలు బహిర్గతమయ్యాయి
  • రాష్ట్ర ప్రజల గొంతు కోసిన పార్టీతో చంద్రబాబు జతకట్టారు
బెంగళూరు విధానసౌధ వేదికగా కాంగ్రెస్, టీడీపీలు ఏకమయ్యాయని, చంద్రబాబు చేసిన ఈ పనికి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని బీజేవైఎం ఏపీ అధ్యక్షుడు  విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇన్నాళ్లూ రహస్యంగా సాగిన చీకటి ఒప్పందాలు ఇప్పుడు బహిర్గతమయ్యాయని, రాష్ట్ర ప్రజల గొంతు కోసిన కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు జతకట్టడం తగదని, ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలకు బాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంచితే, అనంతపురానికి సెంట్రల్ యూనివర్శిటీ మంజూరు కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 25న ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తామని చెప్పారు.
Chandrababu
bjym
Vishnu Vardhan Reddy

More Telugu News