KCR: సాయంత్రం బెంగుళూరుకు వెళ్తున్న కేసీఆర్

  • కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరవుతున్న కేసీఆర్ 
  • ప్రత్యేక విమానంలో సాయంత్రం బెంగుళూరుకు పయనం
  • కేసీఆర్ పాటు మరి కొంత మంది నేతలు
కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్తారా? లేదా? అనే సందిగ్ధతకు తెరపడింది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన హజరవుతున్నారు. ఈ సాయంత్రం ఆయన బెంగళూరుకు వెళ్తున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి బెంగళూరుకు ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు మరికొంత మంది పార్టీ నేతలు కూడా వెళ్లనున్నట్టు సమాచారం. ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేసీఆర్ ను కుమారస్వామి ఆహ్వానించిన విషయం తెలిసిందే.

బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా మూడో ఫ్రంట్ ను ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా హాజరవుతుండటంతో... కేసీఆర్ వెళ్తారా? లేదా? అనే సంశయం నెలకొంది. ఇప్పుడు సందిగ్ధత వీడింది.
KCR
kumaraswamy
oath
bengaluru
Rahul Gandhi

More Telugu News