Karnataka: రాహుల్ మార్క్... పలు రాష్ట్రాల్లో కొత్త బాధ్యులు వీరే!

  • కర్ణాటకలో అధికారంలో భాగస్వామ్యమైన కాంగ్రెస్
  • మోదీ, అమిత్ షాలపై తొలి విజయంతో ఉత్సాహం
  • పలు రాష్ట్రాల్లో మార్పుల ప్రకటన
కర్ణాటక ఎన్నికల తరువాత బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీల ఎత్తులకు పైఎత్తులు వేసి, అధికారంలో భాగస్వామ్యమై తొలి విజయం సాధించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇప్పుడిక ఇతర రాష్ట్రాలపై దృష్టిని సారించారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేసినట్టు తెలుస్తోంది.

హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ చార్జ్ గా రజనీపాటిల్ ను నియమించినట్టు రాహుల్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. గుజరాత్ వ్యవహారాల కోసం ఏఐసీసీ కార్యదర్శులుగా జితేంద్ర బాగెల్, బిస్వా రంజన్ లను, బీహార్ వ్యవహారాల కోసం వీరేంద్ర సింగ్ రాథోడ్, రాజేష్ లిలోథియాలను, ఏఐసీసీ మైనారిటీ విభాగం చైర్మన్ గా నదీమ్ జావెద్ ను నియమిస్తూ, రాహుల్ ఉత్తర్వులు జారీ చేశారు.
Karnataka
Rahul Gandhi
Narendra Modi
Amit sha

More Telugu News